Anirudh Ravichander | అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్కు సూపర్‌క్రేజ్.. ఖాతాలో ఏకంగా పది సినిమాలు
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేలా మ్యూజిక్ అందించే టాలెంట్ యువ సంగీత దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకడు.
ఫిలిం ఇండస్ట్రీ (Anirudh Ravichander)లో బడా దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్ ఎవరైనా ఉన్నారా..? అంటే మ్యూజిక్ లవర్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేలా మ్యూజిక్ అందించే టాలెంట్ యువ సంగీత దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ స్టార్ కంపోజర్ సినిమా ఎలాంటిదైనా, హీరో ఎవరైనా, కథ ఎలాంటిదైనా సరే తన మార్క్ మాత్రం తప్పక ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకడు.
ఏకంగా 10 సినిమాలు అనిరుధ్ రవిచందర్ ఖాతాలో ఉన్నాయంటే ఈ స్టార్ మ్యూజిక్ కంపోజర్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనిరుధ్ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2). లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ (Jailer) చిత్రానికి అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోతో సినిమాలో తన మ్యూజిక్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. మరోవైపు విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న లియోకు ఏ రేంజ్ బీజీఎం ఇవ్వబోతున్నాడో టైటిల్ గ్లింప్స్ వీడియో ద్వారా తెలిసిపోతుంది.
అదేవిధంగా తాజాగా విడుదల చేసిన తలైవా 170కి కూడా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. ధనుష్ 50, ఆట్లీ-షారుఖ్ ఖాన్ కాంబోలో వస్తున్న జవాన్, కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి VD12, శివకార్తికేయన్, అజిత్ కుమార్ (ఏకే 62) సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తం 10 సినిమాలకు పనిచేస్తూ హాట్ టాపిక్‌గా మారిపోయాడు అనిరుధ్ రవిచందర్.
Read Also :
Thalaivar 170 | తగ్గేదేలే.. రజినీకాంత్ 170వ సినిమా అప్డేట్
Virupaksha | సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్ లాంఛింగ్ టైం ఫిక్స్.. వీడియో
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

