ఏం చెప్పినా కాస్తంత బోల్డ్‌గా చెప్పేయడం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్. ‘అర్జున్‌రెడ్డి’ సినిమానే అందుకు నిదర్శనం. డిసెంబర్ 1న ఆయన డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘యానిమల్’ రానుంది. రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న జంటగా రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమాకు చెందిన ఓ రొమాంటిక్ గీతాన్ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట తెలుగు వెర్షన్‌ని అనంతశ్రీరామ్ రాయగా, రాఘవ చైతన్య ఆలపించారు.
ప్రీతమ్ స్వరాలందించారు. ‘అమ్మాయి..’ అంటూ సాగే ఈ పాట సంగీతాభిమానుల్ని కట్టిపడేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పిక్చరైజేషన్ చూస్తుంటే మోస్ట్ రొమాంటిక్‌గా హీరోహీరోయిన్లపై సందీప్ తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. కథ రిత్యా, తమ ప్రేమను కుంటుబసభ్యులకు రష్మిక తెలియజేయడం, వాళ్లు అంగీకరించడంతో ఈ పాట మొదలవుతుందని మేకర్స్ చెప్పారు. ఈ పాట సినిమాపై అంచనాలు పెంచేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాబీడియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్యభూమికలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా.