Animal Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యానిమల్’(Animal). ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు మ్యూజికల్ అప్డేట్ ఇవ్వగా సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ట్రైలర్ సంబంధించి చిత్రంబృందం మరో అప్డేట్ ఇచ్చింది. యానిమల్ ట్రైలర్‌ను ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇక అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి రణబీర్‌ను ఎలా చూపిస్తాడు.. సందీప్ డైరెక్షన్ ఎలా ఉంటుందని చూడడం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. అసలైన వైలెన్స్ ఎలా ఉంటుందో యానిమాల్లో చూపిస్తా అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ట్రైలర్లో ఎంత బ్లడ్ బాత్ ఉందో అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
1:30PM 🪓💥#AnimalTrailer pic.twitter.com/UvzpsTBEyH
— Animal The Film (@AnimalTheFilm) November 23, 2023
మరోవైపు ‘యానిమల్’ టీమ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు వస్తున్న విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా పాల్గొననున్న ఈ అన్‌స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్‌ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.