Animal Movie | ‘యానిమల్’ సందడి.. థియేటర్లో టపాసుల మోత మోగించిన ఫ్యాన్స్
Animal Movie | తమ అభిమాన నటుడి చిత్రం రిలీజవుతోందంటే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. నటుల కటౌట్స్‌కు పాలాభిషేకం, థియేటర్ల ముందు టపాసులు పేల్చడం, డబ్బు వాయిధ్యాలు ఇలా ఒకటేమిటి ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు.
Animal Movie | తమ అభిమాన నటుడి చిత్రం రిలీజవుతోందంటే ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. నటుల కటౌట్స్‌కు పాలాభిషేకం, థియేటర్ల ముందు టపాసులు పేల్చడం, డబ్బు వాయిధ్యాలు ఇలా ఒకటేమిటి ధూంధాంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే, ఈ మధ్య కొందరు ఒకడుగు ముందుకేసి ఏకంగా థియేటర్లలోనే టపాసులు పేల్చడం మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన ‘టైగర్ 3’ (Tiger 3) చిత్ర ప్రదర్శన సమయంలో కొందరు ఫ్యాన్స్ స్క్రీన్ ముందు బాణాసంచా పేల్చిన విషయం తెలిసిందే. తాజాగా రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ‘యానియల్’ చిత్ర ప్రదర్శనలోనూ అదే సీన్ రిపీటైంది. కొందరు స్క్రీన్ ముందు టపాసులు పేల్చి రచ్చ చేశారు.
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’(Animal). సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక అర్జున్ రెడ్డి (Arjun reddy), కబీర్ సింగ్‌లతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి తెలుగు దర్శకుడిగా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన సందీప్ యానిమల్ అంటూ వస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లో కొందరు బాణాసంచా (firecrackers) కాల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మించారు. డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
ఇక ‘యానిమల్’ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్‌వైడ్‌గా రూ.116 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కర్నాటక, తమిళ్, కేరళ కలిపి మొత్తంగా రూ.60 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఒక నాన్ హాలిడే రోజు ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించిన మొదటి చిత్రం ఇదే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read..
Heart Attack | కలచివేస్తున్న గుండెపోటు మరణాలు.. గుజరాత్లో 6 నెలల్లో 1,000 మంది మృతి
Two Planes Crash | ఒకే రన్‌వేపై గంటల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన రెండు విమానాలు.. వీడియో
Ugandan woman | 70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఉగాండా మహిళ.. తొలి మహిళగా రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

