ఊటీలో వినోదాల హంగామా
సంక్రాంతి అంటే సినిమాల సందడి. గత కొన్నేళ్లుగా ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఆయన మరోమారు ‘జనవరి 12 విడుదల’ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి అంటే సినిమాల సందడి. గత కొన్నేళ్లుగా ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఆయన మరోమారు ‘జనవరి 12 విడుదల’ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేష్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. అక్కడి సుందర ప్రకృతి అందాల నడుమ ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఓ పాటతో పాటు టాకీ పార్ట్‌ను కూడా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

