సంక్రాంతి సంబరానికి సిద్ధం
విక్టరీ వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మ్యాసీవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
విక్టరీ వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మ్యాసీవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నది. హీరో కల్యాణ్‌రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి మెడలో పూలదండతో, ైస్టెలిష్ సన్ గ్లాసెస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా ఓ పండుగ వాతావరణంలో కనిపిస్తున్న కల్యాణ్‌రామ్‌ని ఈ ఫస్ట్‌లుక్‌లో చూడొచ్చు.
రంగురంగుల పూలతోరణాలతో అందంగా అలంకరించిన సంప్రదాయబద్ధమైన ఇల్లు, ఆ ఇంట్లో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఆడిపాడుతున్న మహిళలు.. నిజంగా ఈ ఫస్ట్‌లుక్ ఓ ఫెస్టివల్ మూడ్‌ని తలపిస్తున్నది. ఇదిలావుంటే.. తాజాగా ప్రారంభించిన తన ఇన్‌స్టా అకౌంట్లో ఈ ఫస్ట్‌లుక్‌ని కల్యాణ్‌రామ్ షేర్ చేసి, ‘అనిల్ రావిపూడి జోన్లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది.. సంక్రాంతి సంబరానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్, సమర్పకులు: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

