Anil Ravipudi | టాలీవుడ్లో సక్సెస్ఫుల్ దర్శకుడు అంటే వెంటనే గుర్తోచ్చే పేరు అనిల్ రావిపూడి. నందమూరి కళ్యాణ్ రామ్‌తో పఠాస్ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అనిల్. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడమే కాకుండా మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా 8 సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో జర్నీ. ఇందులో చివరి 5 చిత్రాలు కంటిన్యూగా రూ.100 కోట్లు కలెక్ట్ చేశాయి. ఒక దర్శకుడిగా ప్రేక్షకులకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావాట్లేదు. అయితే కొందరూ కామెంట్లు చేస్తుంటారు. నా సినిమాలో కామెడీ క్రింజ్లాగా ఉంటుందని.. జబర్దస్త్ లాంటి షోలు నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమాలు నచ్చుతాయని అంటుంటారు. వారికి నేను ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా.
కొందరు దర్శకులు సినిమా బాగా రావాలని.. స్టడీ చేసి వస్తారు. రైటింగ్ అంటే ఇలా ఉండాలి. స్క్రీన్ ప్లే అంటే ఇలా రాయాలి. ఇక్కడ ఎమోషన్ రావాలి. ఇక్కడ ఎలివేషన్ రావాలి అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ నాకు అవన్నీ తెలిదు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. నాకో సినిమా థియేటర్‌కి వెళ్లి చూసినప్పుడు నచ్చితే ప్రేక్షకుడిగా విజిల్ కొడతా. చప్పట్లు కొడుతా. అదే నాకు తెలిసిన సినిమా. నేను చిన్నప్పుడు నుంచి చూసిన సినిమా ఇదే అంటూ అనిల్ చెప్పుకోచ్చాడు.