సూపర్‌స్టార్‌గా బాలీవుడ్‌ని ఏలుతున్న రోజుల్లోనే కాదు, 60 ఏండ్ల పైబడిన వయసులో కూడా చక్కని ఫిజిక్‌తో సాధ్యమైనంతవరకూ జనానికి అందంగానే కనిపిస్తుంటారు అనిల్‌కపూర్. రగ్గ్డ్గా ఎప్పుడూ కనిపింలేదు. తొలిసారి అనిల్కపూర్ని సరికొత్త లుక్‌లో చూపించి దేశవ్యాప్తంగా ఉన్న అనిల్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రణబీర్‌కపూర్ హీరోగా ఆయన ‘యామిమల్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో అనిల్‌కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అనిల్‌కపూర్ పాత్ర పేరు బల్బీర్‌సింగ్ అని రివీల్ చేశారు. అనిల్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో గెటప్‌ని బట్టి మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, త్రిప్తీ డిమ్రీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాకు నిర్మాతలు : భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, నిర్మాణం టి.సిరీస్, భద్రకాళి పిక్చర్స్.