బాధ్యతగా మెలగాలి..
అనీత్ పడ్డా.. ప్రస్తుతం బాలీవుడ్వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. అభినయం, అంతకుమించిన అందంతో.. బీటౌన్‌ను షేక్ చేస్తున్నదీ 22 ఏండ్ల అమృత్సర్ అమ్మడు. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకొని.. ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నది.
అనీత్ పడ్డా.. ప్రస్తుతం బాలీవుడ్వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. అభినయం, అంతకుమించిన అందంతో.. బీటౌన్‌ను షేక్ చేస్తున్నదీ 22 ఏండ్ల అమృత్సర్ అమ్మడు. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకొని.. ఊహించని పాపులారిటీని సొంతం చేసుకున్నది. ఒక్క చిత్రంతోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి ఎక్కేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనీత్ పడ్డా.. తన మనస్తత్వానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నది. తాను చాలా సెన్సిటివ్ అనీ.. ఏ విషయం గురించైనా చాలా లోతుగా ఆలోచిస్తానని అంటున్నది.
“మనతో ప్రేమగా ఉండే వ్యక్తుల విషయంలో.. మనం బాధ్యతగా మెలగాలి. ముఖ్యంగా, మనల్ని సమర్థించే వారితో మనం సరిగ్గా వ్యవహరించాలి. ఈ ఆలోచనలు.. నాపై ఒత్తిడిని పెంచుతాయి. అలాగే, నా అభిమానులు కూడా, చాలా విషయాల్లో నన్ను సరిదిద్దుతుంటారు” అంటూ చెప్పుకొచ్చింది. “నిజానికి నేను చిన్నప్పుడు చాలా అమాయకురాలిని. అనేక విషయాల గురించి చాలా కలలు కనే దానిని. అందుకు తగ్గట్టే హార్డ్‌వర్క్ చేసేదాన్ని” అంటూ తన బాల్య సంగతులను గుర్తుచేసుకున్నది. ఇక ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించొద్దనీ, మీరెలా ఫీలవుతారో అలాగే ఉండాలని అంటున్నది.
అమృత్‌సర్‌లో పుట్టి పెరిగిన అనీత్ పడ్డా.. నటనపై ఆసక్తితో బీటౌన్‌లో అడుగుపెట్టింది. యుక్తవయసులోనే మోడలింగ్‌లోకి ప్రవేశించింది. అనేక ప్రకటనలు, ప్రమోషనల్ ప్రచారాలలో కనిపించింది. 2022లో కాజోల్ నటించిన ‘సలాం వెంకీ’ చిత్రంలో.. ఓ చిన్న పాత్రతో తెరపై మెరిసింది. 2024లో వచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో షో ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’తో మొదటి బ్రేక్ అందుకున్నది. ఈ ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా నిలిచిన ‘సైయ్యారా’లో అహాన్ పాండేతో కలిసి అద్భుతమైన అరంగేట్రం చేసింది. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అమర్ కౌశిక్ దర్శకత్వంలోరాబోతున్న హారర్ చిత్రం.. ‘శక్తి శాలిని’లో నటిస్తున్నది అనీత్ పడ్డా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

