Anchor Suma | మీడియాను నిండుమనసుతో క్షమాపణలు కోరిన యాంకర్ సుమ
Anchor Suma | యాంకర్ సుమ (Anchor Suma) మీడియాను క్షమాపణలు కోరింది (apologizes to media ). ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.
Anchor Suma | యాంకర్ సుమ (Anchor Suma).. ఈ పేరు తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ సుమ ఎవరు..? అని అడగ్గా టక్కున చెప్పేస్తారు. సుమ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో గడగడా మాట్లాడుతూ.. ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంటుంది. ఏ సినిమా ఈవెంట్, షో అయినా వ్యాఖ్యాతగా సుమ ఉండాల్సిందే. కొందరు దర్శక నిర్మాతలు సుమ డేట్స్ కోసం తమ ఈవెంట్స్‌ను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటుంటారు. అంతటి గుర్తింపు తెచ్చుకున్న సుమ.. తాజాగా మీడియాను క్షమాపణలు కోరింది (apologizes to media ).
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆదికేశవ’ (Adikesava). ఈ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకను చిత్ర బృందం హైదాబాద్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మీడియాపై నోరు పారేసుకున్నారు. ‘మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఓ విలేకరు సీరియస్‌గా తీసుకున్నారు. మీడియా వారిని అలా అనకుండా ఉండాల్సింది అని సుమ ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సుమ స్పందిస్తూ.. ‘మీడియా వారంతా నాతో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నారు. ఆ చనువుతోనే అలా అన్నాను’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ‘మీరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు.. ఓకేనా’ అంటూ సదరు విలేకరుని కూల్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆతడు మరోసారి అసహనానికి గురయ్యారు. ‘ఇదే వద్దనేని. మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే. మాకు కూడా నచ్చుతుంది. అయితే, మీడియా విషయంలో ఇలాంటివి వద్దు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. వెంటనే సుమ అక్కడే విలేకరులకు క్షమాపణలు చెప్పారు.
ఇప్పుడు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మీడియా మిత్రులకు సారీ చెప్పిన Suma Kanakala గారు 👍#sumakanakala pic.twitter.com/8I9pUVUMmH
— Kiran Mahesh (@kiranmahesh026) October 25, 2023
Also Read..
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. పెద్దాయనపై చేయి చేసుకున్న తోటి ప్రయాణికుడు.. VIDEO
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

