టాప్ 3 ఎవరో చెప్పేసిన యాంకర్ రవి.. కాజల్‌కు నిరాశే..

Anchor Ravi | బిగ్ బాస్ 5 తెలుగు నుంచి ఈ మధ్యే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశాడు యాంకర్ రవి. ఆయన రావడం అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు. అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎలా బయటికి వచ్చాడో అర్థం కావడం లేదంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు రవి కూడా తన ఎలిమినేషన్‌ను అస్సలు ఊహించలేదనే చెప్తున్నాడు. మరోవైపు ఈయన బయటకు వచ్చిన తర్వాత వరసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తన సోషల్ మీడియా పేజీలో కూడా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు రవి. ఆ సందర్బంగా ఓ షోలో తనను కొందరు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. వాటికి కూడా చాలా ఓపికగా సమాధానమిచ్చాడు రవి.
అంతా కూడా తనను ఇన్ఫ్ల్యూయెన్స్ చేస్తాడంటూ చెప్పారని.. కానీ అందులో నిజం లేదంటున్నాడు రవి. హోస్ట్ కూడా తనను అలాగే పిలిచాడని.. అయితే తనను షణ్ముఖ్ జస్వంత్ ఒకసారి అలా అనడం వల్ల అంతా తనను అలాగే పిలవడం మొదలుపెట్టినట్లు చెప్పాడు యాంకర్ రవి. నిజానికి తన ఆట మాత్రమే తాను ఆడానని.. ఇతరుల ఆటలో వేలు పెట్టలేదంటున్నాడు ఈయన. ఆటలో తాను రూల్ ప్రకారం ఆడుతూ వచ్చానే కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదంటూ చెప్పాడు రవి. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరుంటారో కూడా చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ జస్వంత్, సన్నీ, శ్రీరామచంద్ర ఈ సారి టాప్ 3లో ఉంటారని చెప్పాడు రవి.
విజేత ఎవరు అనేది మాత్రం తాను ఇప్పుడే చెప్పలేను అంటూ క్లారిటీ ఇచ్చాడు. తన మద్దతు ఎవరికి ఉంటుందో వాళ్లకు ఇస్తాను.. కచ్చితంగా మీరు మీ అభిమాన కంటెస్టెంట్స్ కు ఓట్లు వేస్తూ వాళ్లను సేవ్ చేస్తూ ఉండండి అంటూ అభిమానులకు సూచించాడు. ఈయన ఎలిమినేట్ అయిన రోజు తన సపోర్ట్ శ్రీరామ్‌కే ఉంటుందని స్టేజీపైనే చెప్పాడు. తాను బయటికి వచ్చినా కూడా నిన్ను గెలిపించడానికి ఏం చేయాలో చేస్తాను బ్రదర్ అంటూ చెప్పాడు. ఇప్పుడు ఇదే చేస్తున్నాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పింకీతో గొడవ.. ఇన్ని రోజులకు మానస్‌లో ఆ తెగింపు కనిపించింది..
Sunny: ఇదో కొత్త స్ట్రాటజీనా.. సన్నీకి కిస్ పెట్టిన ప్రియాంక
Shanmukh: మళ్లీ ఒకే దుప్పట్లోకి దూరిన సిరి-షణ్ముఖ్..వీళ్లు మారరా అంటూ నెటిజన్స్ కామెంట్స్
Priyanka: ప్రియాంక చేసిన పనికి బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్
Bigg Boss: ఐస్ టబ్‌లో నిలుచున్న హౌజ్‌మేట్స్.. సన్నీ-సిరి మధ్య వార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

