పింకీతో గొడవ.. ఇన్ని రోజులకు మానస్‌లో ఆ తెగింపు కనిపించింది..

Priyanka singh and manas | బిగ్‌బాస్ 5 తెలుగు చూస్తుండగానే 13వ వారంలోకి వచ్చేసింది. మరో రెండు మూడు రోజుల్లో అది కూడా అయిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన షోను బట్టి కారెక్టర్స్ ఈజీగా అర్థమైపోయాయి ప్రేక్షకులకు. అందులో కొందరు గొడవలు పెట్టుకోడానికి.. మరికొందరు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మొదటి రకం కంటెస్టెంట్స్ ఇప్పుడు ఇంట్లో కొందరున్నారు. కానీ రెండో రకం మాత్రం ఒక్కరిద్దరు మాత్రమే ఉన్నారు. గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించే వాళ్లలో మానస్ కూడా ఉంటాడు. ఈయన తన పనేదో తాను చూసుకుంటాడు. పాయింట్ కరెక్టుగా మాట్లాడి.. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తాను చెప్పాలనుకున్నది కన్ఫ్యూజన్ లేకుండా.. క్లారిటీగా చెప్తాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేశాడు. తాజాగా ప్రియాంక సింగ్‌తో జరిగిన మానస్ కాన్వర్షేషన్పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
బయట బెంచ్‌పై కూర్చుని మానస్, ప్రియాంక మాట్లాడుకుంటున్నపుడు తన పాయింట్ చెప్పి ఆలోచించుకో అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయాడు మానస్. దాంతో పింకీ సీరియస్ అయింది. నేను నీతో మాట్లాడుతున్నాను.. నీదైతే నువ్వెళ్లి పోతావా అని ప్రశ్నించింది పింకీ. అవును.. నాదైతే నేను వెళ్లిపోతాను అంటూ మానస్ తనదైన స్టైల్ కూల్‌గా చెప్పాడు. అక్కడే కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత మళ్లీ మానస్ దగ్గరికి వెళ్లి నేను నీతో మాట్లాడతాను అంటూ చెప్పింది పింకీ. దానికి ఏ మాత్రం మొహమాటం లేకుండా మానస్ వద్దంటూ సమాధానమిచ్చాడు.
నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదంటూ తెగేసి చెప్పాడు మానస్. ఇన్ని రోజులు ఆమెతో మాట్లాడేటప్పుడు ఏమనుకుంటుందో అంటూ కాస్త తగ్గేవాడు మానస్. కానీ ఇప్పుడు అలాంటి మొహమాటాలేం లేకుండా కుండ బద్ధలు కొట్టేశాడు. దాంతో కాసేపు మానస్, ప్రియాంక సింగ్ మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. ఈ వ్యవహారంలో నెటిజన్స్ ఎక్కువగా మానస్‌కే మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మానస్ చెప్పినా కూడా వినకుండా పింకీ పెంకితనం చేసేది. కానీ ఇప్పుడు ఫైనల్‌గా ప్రియాంకను మానస్ వదిలించేసుకున్నాడని అర్థమవుతుంది. షో చివరికి వచ్చేటప్పటికీ ఎమోషనల్ బాండింగ్ లేకుండా తన ఆటపై ఫోకస్ చేస్తున్నాడు మానస్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sunny: ఇదో కొత్త స్ట్రాటజీనా.. సన్నీకి కిస్ పెట్టిన ప్రియాంక
Shanmukh: మళ్లీ ఒకే దుప్పట్లోకి దూరిన సిరి-షణ్ముఖ్..వీళ్లు మారరా అంటూ నెటిజన్స్ కామెంట్స్
Priyanka: ప్రియాంక చేసిన పనికి బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్
Bigg Boss: ఐస్ టబ్‌లో నిలుచున్న హౌజ్‌మేట్స్.. సన్నీ-సిరి మధ్య వార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

