Bigg Boss: ఐస్ టబ్‌లో నిలుచున్న హౌజ్‌మేట్స్.. సన్నీ-సిరి మధ్య వార్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతం హౌజ్‌లో 7గురు కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటి నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టు కసితీరా ఆడుతున్నారు. తాజాగా బిగ్ బాస్‌లో టికెట్ టూ ఫినాలే అనే టాస్క్ ఇవ్వగా, ఇందులో కంటెస్టెంట్స్ అందరు ఐస్ టబ్స్ లో నుంచి కాళ్లు బయటపెట్టకుండా తమ దగ్గర ఉన్న బాల్స్‌ని కాపాడుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తొలి రౌండ్లో గేమ్ ఆసక్తిగా సాగని క్రమంలో బిగ్ బాస్ స్వాప్ చేశారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. సిరి పక్కకు సన్నీ వెళ్తే.. కాజల్-మానస్ మధ్యలోకి షణ్ముఖ్ వచ్చాడు. ఈ గేమ్ లో సన్నీ-సిరి మధ్య పెద్ద ఫైట్ నడిచింది. సన్నీ కాలు కిందపెట్టాడో లేదో సిరి అతని బాల్స్ తీసుకుంది. తాను మాత్రం పెట్టలేదని వాదించాడు. సిరి బాల్ తీసే టైంలో సన్నీ ఒక కాలు కింద.. ఒక కాలు టబ్‌లో ఉన్నట్టుగా కనిపించింది.
సిరిపై కోపంతో రగిలిపోయిన సన్నీ ఆమె ఎప్పుడు కాలు బయటపెడుతుందా, నొక్కేద్దామా అన్నట్టు కాచుకు కూర్చున్నాడు. నేను గివ్ అప్ ఇవ్వను గేమ్ ఆడతాను అంటూ పెద్దగా అరుస్తూ, రవి.. ఐ మిస్ యూ అంటూ సిరి ఏడ్చేయగా, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్ గొంతెత్తి అరిచాడు. ఈ చర్యతో మిగతా వాళ్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఇంట్లో మంచిగా ఆడుతున్న వాడిని బయటకు పంపి ఇప్పుడు అతని ఫ్యాన్స్ సింపతీ కొట్టేద్దామని ట్రై చేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

