టికెట్ టూ ఫినాలే టిస్క్ ఆసక్తికరంగా సాగుతున్న నేపథ్యంలో సిరి-సన్నీ మధ్య ఫైట్ రంజుగా సాగింది. ఇద్దరి మధ్య పోటాపోటీగా ఫైట్ నడిచింది. గేమ్‌ని గేమ్‌లా కాకుండా పర్సనల్ ఎటాక్ చేస్తున్నావ్ ఎందుకు అంటూ ఏడ్చేసింది సిరి. అయితే పడేసిన బాల్స్‌ని సన్నీ ట్యూబ్‌లోకి తెచ్చి పెట్టాడు సన్నీ. అయితే ఓవైపు ఏడుస్తూనే ఉన్న సిరి.. సన్నీ బాల్స్ తీయడం మాత్రం మానలేదు. బజర్ మోగేసరికి సిరి కాళ్లు ఐస్‌లో నుంచి తీయకుండా అలానే మొండిగా గేమ్ ఆడి.. ఏడుస్తూనే ఉంది.
ఐస్‌లో ఉండడం వలన ఇంటి సభ్యులు గాయపడగా, వారి కోసం డాక్టర్ని పంపారు బిగ్ బాస్. అయితే డాక్టర్ వచ్చేంత వరకు ఎవరు వేడినీళ్లు ఉపయోగించకూడదు అని చెప్పారు. గేమ్ ముగియగానే మానస్ సిరికి సాయం అందించాడు. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్ ఆమెను ఎత్తుకుని తీసుకురావడాన్ని షణ్ను తట్టుకోలేకపోయాడు. వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. ఇలాగైతే నాకు ఫ్రెండ్‌గా ఉండకంటూ ఆవేశంతో ఊగిపోగా సిరి ఏడ్చేసింది.
వేడి నీళ్లు పోయకూడదు అని హెచ్చరించిన కూడా పింకీ.. శ్రీరామ్‌కు అర్ధరాత్రి జండూ భామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతడికి వాపు తగ్గడం కాదు కదా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని పింకీ శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.