Ananya Pandey | అనన్య పాండే డాన్స్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. ‘చాంద్ మేరా దిల్’లో భరతనాట్యం సీన్ వైరల్
Ananya Pandey | బాలీవుడ్ నటి అనన్య పాండే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘లైగర్’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న అనన్య, ఇప్పుడు తన కొత్త చిత్రం ‘చాంద్ మేరా దిల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ananya Pandey | బాలీవుడ్ నటి అనన్య పాండే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘లైగర్’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్న అనన్య, ఇప్పుడు తన కొత్త చిత్రం ‘చాంద్ మేరా దిల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ప్రేమకథా చిత్రంలో ‘కిల్’ ఫేమ్ లక్ష్య లాల్వాని హీరోగా నటించాడు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. హిందీ చిత్రం అయినప్పటికీ కథాంశం మొత్తం హైదరాబాద్ నేపథ్యంతో సాగడం ఆసక్తికరంగా మారింది. కాలేజీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునేలా రూపొందించారని చిత్రబృందం చెబుతోంది.
అయితే ప్రస్తుతం సినిమా కంటే అందులోని ఒక సీన్ ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. ఇందులో అనన్య పాండే చేసిన భరతనాట్యం ప్రదర్శనపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె డాన్స్ మూవ్మెంట్స్, స్టెప్పులు సంప్రదాయ నాట్యశైలికి భిన్నంగా ఉన్నాయంటూ పలువురు విమర్శిస్తున్నారు. కొందరు నెటిజన్లు “భరతనాట్యాన్ని సరదాగా మార్చేశారా?” అంటూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం ఇది దర్శకుడి విజన్‌లో భాగమని అభిప్రాయపడుతున్నారు. ఈ సీన్‌పై వస్తున్న స్పందనలతో హీరోయిన్ అనన్య పాండేతో పాటు దర్శకుడు వివేక్ సోని కూడా నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా వేదికల్లో ఈ క్లిప్ వైరల్ అవుతూ అనేక మీమ్స్, ట్రోల్స్‌కు కారణమవుతోంది.
ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే, ‘చాంద్ మేరా దిల్’ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ప్రారంభ వీకెండ్లో సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో రూ.15 కోట్ల మార్క్‌ను కూడా దాటలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ డాన్స్ సీన్ కారణంగా సినిమాకు అదనపు ప్రచారం లభిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతికూల స్పందన వచ్చినా, సోషల్ మీడియా హడావుడి వల్ల సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగే అవకాశమూ ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వైరల్ ట్రెండ్ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

