Anand Deverakonda | యాక్షన్ మోడ్‌లో ఆనంద్ దేవరకొండ.. బేబి తర్వాత ఇంత ట్రాన్స్ఫర్మేషనా?
Anand Deverakonda | బేబి సినిమాతో తొలి థియేట్రికల్ హిట్టు కొట్టి సూపర్ ఫాంలోకి వచ్చాడు ఆనంద్ దేవరకొండ. తొలి సినిమా దొరసానికి కాస్త అటు ఇటుగా టాక్ వచ్చినా.. ఆనంద్ పర్ఫార్మామెన్స్ పర్వాలేదనిపించింది.
Anand Deverakonda | బేబి సినిమాతో తొలి థియేట్రికల్ హిట్టు కొట్టి సూపర్ ఫాంలోకి వచ్చాడు ఆనంద్ దేవరకొండ. తొలి సినిమా ‘దొరసాని’కి కాస్త అటు ఇటుగా టాక్ వచ్చినా.. ఆనంద్ పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నేరుగా ఓటీటీలో రిలీజైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఆనంద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆడియెన్స్‌లో ఆనంద్ పేరు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత యధావిధిగా ‘పుష్పక విమానం’, ‘హైవే’ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లుగా నిలిచి.. వచ్చిన ఆ కొంచెం పేరు కూడా ఈ రెండు ఫ్లాపులతో తుస్సుమంది. అయితే ఈ ఏడాది వచ్చిన ‘బేబి’ మాత్రం ఆనంద్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. కలెక్షన్ల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆనంద్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్కు యూత్ వెర్రెత్తిపోయారు.
ముఖ్యంగా ఆటో, మాస్ జనాలు ఆనంద్ రోల్లో తమను చూసుకున్నామని చెప్పడం గమనార్హం. ఒక యాక్టర్‌కు ఇంత కన్నా కావాల్సిన అచీవ్మెంట్ ఏముంటుంది. ఒక ఆటో నడుపుకునే అబ్బాయి తను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే.. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది. వాడి మానసిక పరిస్థితి ఏంటి అనే క్యారెక్టర్లో ఆనంద్ జీవించేశాడు. మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో ఆనంద్ నటన వర్ణనాతీతం. యూత్‌లో ఆ క్యారెక్టర్ చూపిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఏకంగా విజయ్‌కు అర్జున్ రెడ్డి ఎలాగో.. ఆనంద్‌కు బేబి అలాగే అంటూ కంపారిజన్లు కూడా చేసేసారు. ఇక వంద కోట్లకు పది కోట్ల దూరంలో ఆగిపోయిన బేబి ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ.. లక్షల్లో వ్యూస్ కొల్లగొడుతుంది.
ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ క్యూరియాసిటితో ఎదురు చూశారు. కాగా తాజాగా ఆనంద్ గంగం గణేశా అంటూ రెండు తుపాకులను చేతిలో పట్టుకుని యాక్షన్ అవతారంలో దర్శనమిచ్చాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వీలైనంత తొందరగానే సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కాగా బేబి వంటి యూత్ కంటెంట్ తర్వాత ఒక్క సారిగా ఆనంద్ మాస్ జానర్ వైపు వెళ్లాడంటే రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆనంద్‌కు ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతుంది. ఇలాంటి టైమ్‌లో యాక్షన్ సినిమాతో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందడం చాలా కష్టం.
కంటెంట్ కొత్తగా ఉండి.. సరైన ఎంటర్టైనమెంట్ ఉంటే సినిమాకు తిరుగుండదు. కానీ వీటిల్లో ఏది తేడా కొట్టినా భారీ మూల్యం చెల్లించకతప్పదు. అయితే ఆనంద్.. ఈ సినిమాను బేబి టైమ్‌లోనే చేసుంటాడు. బేబి అంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించి ఉండడు. పైగా ఆ టైమ్‌లో ఆనంద్‌కు అవకాశాలు రావడమే గగనం. అలాంటి టైమ్‌లో తప్పక ఒప్పుకున్న సినిమా ఇదని అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఆనంద్ కెరీర్‌కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

