‘బేబీ’తో బ్లాక్‌బస్టర్ అందుకు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్‌శెట్టి దర్శకుడు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ, అనుదీప్ కేవీ, ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు, ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ డైరెక్టర్ వినోద్ అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ- “ ఎనర్జిటిక్, కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఇది.
టీజర్ అందరూ బాగుందంటున్నారు. సినిమా అంతకంటే బాగుంటుంది. ఆనంద్ దేవరకొండకు ఇది డిఫరెంట్ జానర్. తొలిసారి యాక్షన్ హీరోగా కనిపిస్తారాయన. ఈ ఏడాది ఆనంద్కి ఇది సెకండ్ హిట్ అవుతుంది. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు. భయం, అత్యాశ, కుట్ర ఈ మూడింటి చుట్టూ తిరిగే కథాంశమిదనీ, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందనీ, ఈ సినిమా దర్శకుడు ఉదయ్శెట్టికి మంచి పేరు తెచ్చిపెడుతుందనీ, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చే సినిమాగా నిలుస్తుందని ఆనంద్ దేవరకొండ ఆకాంక్షించారు.