ముంబై: సర్కస్, శాంతి, సర్ఫరోష్ లాంటి సినిమాల్లో నటనతో గొప్ప పేరు తెచ్చుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ షిండే (70) ఇక లేరు. అనారోగ్య కారణాలతో ఇవాళ తెల్లవారుజామున ఒంటిగంటలకు ముంబైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం పార్శివాడలోని హిందూ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
సునీల్ షిండే తన 30 ఏండ్ల కెరీర్లో గాంధీ, ఖల్నాయక్, ఘయాల్, జిడ్డీ, దౌడ్, మగాన్, విరుద్ధ్ లాంటి సినిమాల్లో చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆయన మంచి పేరు తెచ్చిపెట్టాయి. అమీర్ ఖాన్ సర్ఫరోష్ సినిమాలో సునీల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నటించారు. రోహిత్ శెట్టి జమీన్ మూవీలో పనికిమాలిన రాజకీయ నాయకుడి పాత్ర పోషించారు.