రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. సోమవారం హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ థండర్ పేరుతో ఓ యాక్షన్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రామ్ తనదైన శైలి మాస్ లుక్తో కనిపించాడు. సదర్ పండగ నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉంది.
‘నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా..’ ‘నీ గేటు దాటలేనన్నావ్ దాటా..’వంటి సంభాషణలు పవర్ఫుల్గా సాగాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తనదైన శైలి భావోద్వేగాలు మేళవించి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.