Amitabh Bachchan | చెప్పు వదిలేస్తే ఇంత వైరల్ అవుతుందా.. ‘పుష్ప’ మూవీపై అమితాబ్ కామెంట్స్.!
Amitabh Bachchan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన సినిమా ‘పుష్ప’. 2021లో విడుదలైన ఈ చిత్రం విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Amitabh Bachchan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Iconstar Allu arjun) కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన సినిమా ‘పుష్ప’. 2021లో విడుదలైన ఈ చిత్రం విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారతీయ బాక్సాపీస్ వద్ద 350కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పురస్కారాన్ని గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. ‘పుష్ప’ చిత్రంలో అసమాన అభినయానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు నటుడిగా నిలిచారు. ఇక ఈ సినిమాలోని శ్రీవల్లీ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది ఈ సాంగ్.
అయితే తాజాగా శ్రీవల్లీ పాటపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 14 ఏండ్లుగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో 15 సీజన్ రీసెంట్గా ప్రసారమవుతోంది. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్ లో పుష్ప సినిమాపై ప్రశ్న రాగా.. ఆ ప్రశ్నకు అమితాబ్ సమాధానం ఇస్తూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప నిజంగా ఓ అద్భుతం, ఆ సినిమాలోని శ్రీవల్లీ పాట ఇండియా వైడ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ సాంగ్‌లో అల్లు అర్జున్ చెప్పును వదిలేసే స్టెప్ ఒకటి ఉంటుంది. కేవలం చెప్పును వదిలేస్తే ఈ రేంజ్లో వైరల్ అవడం నేను మొదటి సారి చూశాను. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారు. అంటూ అమితాబ్ కేబీసీ షోలో తెలిపారు. ప్రస్తుతం అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేవలం చెప్పు వదిలేస్తే ఈ రేంజ్ లో వైరల్ అవడం అనేది నేను మొదటి సారి చూస్తున్నా.. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ పై అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ కు ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

