అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఫస్ట్‌లుక్‌తోనే బన్నీ అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ గురించి అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ఆయన తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపిస్తారని, అందులో ఓ పాత్ర పూర్తి నెగెటివ్ షేడ్స్‌లో ఉంటుందని ప్రచారం జరుగుతున్నది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు భిన్న పార్శాలు కలిగిన పాత్రల్లో కనిపిస్తారట. ఆయన గెటప్స్‌తో పాటు.. పాత్ర తాలూకు వ్యక్తిత్వాలు కూడా విభిన్నంగా ఉంటాయని తెలిసింది. ఇందులో ఓ పాత్ర పూర్తి నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని, ఫస్ట్‌లుక్‌లో అదే పాత్రను చూపించారని అంటున్నారు. పునర్జన్మ అంశంతో పాటు పురాణ, వర్తమాన కాలాల నేపథ్యంలో భారీ విజువల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.