Allu Arjun 22 Project | పుష్ప 2 ది రూల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తున్నాడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు బన్నీ సూపర్ అప్డేట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తుండగా.. అల్లు అర్జున్ 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త అప్డేట్ వైరల్‌గా మారింది. ఇటీవల అల్లు అర్జున్ ఒక పెళ్లికి హాజరుకాగా.. ఆయన లుక్ వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హతో కలిసి ఇటీవల తన కజిన్ వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ చాలా సాధారణమైన, కానీ స్టైలిష్‌గా కనిపించారు. ఆయన లేత గోధుమ రంగు కుర్తా మరియు నల్లటి ప్యాంటు ధరించి, కొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు.
అల్లు అర్జున్ నూతన వధూవరులను ఆశీర్వదించి, వారితో కలిసి ఫోటోలు దిగారు. పెళ్లిలో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఫోటోలు చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్ రాబోయే అట్లీ సినిమా కోసమే అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ‘AA 22 x A6’ వర్కింగ్ టైటిల్‌తో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో సినిమా రానుంది. బన్నీకి ఇది 22వ చిత్రం కాగా, అట్లీకి ఇది 6వ సినిమా. నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1
— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025