Allu Arjun | రజనీకాంత్ మాటలు విని షాకయ్యాను: అల్లు అర్జున్
Allu Arjun - Rajinikanth | గంగోంత్రితో కెరీర్ మొదలుపెట్టి పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా, జాతీయ ఉత్తమనటుడిగా అల్లు అర్జున్ కెరీర్ చూస్తే ఎక్కడా గంగోంత్రి ఎక్కడా పుష్ప అనిపించకమానదు. ఆర్యతో ఆయన సినిమా కెరీర్‌ను టర్న్ చేశాడు దర్శకుడు సుకుమార్.
Allu Arjun – Rajinikanth | గంగోంత్రితో కెరీర్ మొదలుపెట్టి పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా, జాతీయ ఉత్తమనటుడిగా అల్లు అర్జున్ కెరీర్ చూస్తే ఎక్కడా గంగోంత్రి ఎక్కడా పుష్ప అనిపించకమానదు. ఆర్యతో ఆయన సినిమా కెరీర్‌ను టర్న్ చేశాడు దర్శకుడు సుకుమార్. అసలు గంగోంత్రి బన్నికి ఆర్య బన్నికి కంప్లీట్ మేకోవర్ చేపించి ఆర్య చిత్రంతో అల్లు అర్జున్ను సరికొత్తగా చూపించాడు సుకుమార్. ఇక పుష్ప చిత్రంలో పుష్పరాజ్ తగ్గేదేలా అంటూ ఐకాన్‌స్టార్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం గురించి ప్రత్యేక ప్రస్తావన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్ప-2 చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకలు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ రోజు అల్లు అర్జున్ పొజిషన్ అంతా ఈజీగా వచ్చింది కాదు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎంతో డెడీకేషన్ ఆయన లైఫ్‌లోనూ వున్నాయి. ఇక కెరీర్ ప్రారంభంలో ఆర్య లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత బన్నీ, హ్యపీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు చేసి కూడా బన్నీ ఒక్కొసారి నన్ను ఎవరూ గుర్తుపడతారో లే అనుకునేవాడట.
ఇదే విషయం గురించి బన్నీ ఓ సందర్భంలో ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను. అప్పుడు అక్కడ రజనీకాంత్, శంకర్ కలయికలో రాబోతున్న రోబో షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేస్తున్న రత్నవేలు మా ఆర్య సినిమాకు కూడా కెమెరామెన్‌గా పనిచేశాడు. ఆయన్ని కలిసి మాట్లాడాం. అయితే రజనీని కలవాలని వున్నా మళ్లీ నేను అల్లు అరవింద్ అబ్బాయినని చెప్పి గుర్తు చేసి మాటలు కలపడం ఎందుకులే అనిపించి అక్కడి నుంచి బయలుదేరాను.
ఇంతలో ఎవరో వచ్చి మిమ్మల్ని రజనీకాంత్ గారు రమ్మంటున్నారు అని చెప్పారు. నేనూ నా దర్శకుడు సుకుమార్ వెళ్లి కలిశాం. నేను సినిమాల్లో నటిస్తున్న సంగతి ఆయనకు తెలుసో లేదో అనుకున్నా.. కానీ ఆయన మాత్రం సినిమాలు బాగా చేస్తున్నావయ్యా లేడిస్లో నీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాందించుకున్నావు అనే సరికి నేను షాకయ్యాను. స్టయిల్‌కి, క్రేజికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచే రజనీకాంత్ నా గురించి అలా మాట్లాడేసరికి ఆక్షణం నాలో తెలియని ఆనందం కలిగింది అని చెప్పుకొచ్చారు.
Also Read..
- Call Me Bae | అనన్య పాండేను రీ లాంచ్ చేస్తున్న కరణ్ జోహార్.. ఈసారి ఎక్కడంటే.!
- Blood Donation | డల్లాస్‌లో విజయవంతంగా టీపాడ్ రక్తదాన శిబిరం
- Bhatti Vikramarka | కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గృహ జ్యోతి పథకం వర్తింప చేయండి : భట్టి విక్రమార్క
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

