బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా..నయనతార నాయికగా కనిపించనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ ఉందని, ఆ పాత్రలో స్టార్ హీరో నటిస్తేనే బాగుంటుందని దర్శకుడు అట్లీ భావిస్తున్నారట. ఈ క్యారెక్టర్ కోసం చిత్రబృందం అల్లు అర్జున్ను సంప్రదించినట్లు సమాచారం. ‘కథలో ఒక ముఖ్య పాత్ర ఉంది.
ఇది సినిమాకు ఎంతో కీలకం. ఒక స్టార్ హీరో పోషిస్తేనే ఆ పాత్ర బలంగా తెరపై కనిపిస్తుంది. ఇప్పటిదాకా షారుఖ్‌తో కలిసి నటించని ఒక హీరో కావాలి. ఇందుకోసం దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ను కలిసి కథ వినిపించారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన అంగీకారం తెలపలేదు. అయితే కొద్ది రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తారు. ఔనంటారనే ఆశిస్తున్నాం.’ అని ‘జవాన్’ చిత్రబృందంలోని ఓ సభ్యుడు తెలిపారు. ఇక ఈ చిత్రంలో అతిథి పాత్రలో తమిళ స్టార్ విజయ్ నటిస్తాడనే రూమర్స్ గతంలో బయటకొచ్చాయి.