Allu Aravind | ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సంక్రాంతి స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘భోళా శంకర్’ ఫ్లాప్ తర్వాత చిరంజీవి ఖాతాలో పడిన ఈ హిట్‌తో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అలాగే అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపించి కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి రూపొందించిన కథనం, వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా సమపాళ్లలో అందిస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా చిరు స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కీలక సన్నివేశాల్లో వచ్చే ఎలివేషన్ షాట్స్ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత ఆయన మాట్లాడుతూ,“సినిమా చూసి బయటకు వస్తుంటే ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవల్. బాస్ చించేశాడు. బాస్ ఈజ్ బాస్. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. వింటేజ్ డ్యాన్స్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు ఆ పాత చిరుని తీసుకొచ్చిన విధానం అద్భుతం. డైరెక్టర్ ఏం ఆలోచించాడో అర్థమైంది. వెంకీ ఎంట్రీ, కాంబినేషన్ నెక్స్ట్ లెవల్. పైసా వసూల్ సినిమా. ఫుల్ ఎగ్జైట్మెంట్తో బయటకు వస్తారు” అని ప్రశంసలు కురిపించారు. అల్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత కొంతకాలంగా అల్లు కుటుంబం, మెగా కుటుంబం మధ్య దూరం పెరిగిందన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అల్లు అరవింద్ తల్లి మరణం తర్వాత చిరంజీవి కుటుంబం అల్లు ఫ్యామిలీకి అండగా నిలవడం, ఇప్పుడు అల్లు అరవింద్ స్వయంగా చిరు సినిమాపై ఈ స్థాయిలో ప్రశంసలు చేయడం… ఈ పరిణామాలన్నీ మెగా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అందుకే “ఇప్పుడు అంతా ఓకే ” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయం మాత్రమే కాదు, ఇండస్ట్రీలో సంబంధాల పరంగా కూడా పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు.