Sri Tej | శ్రీతేజ్‌ని పరామర్శించిన అల్లు అరవింద్, బన్నీ వాసు.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది?
Sri Tej | పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Sri Tej | పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్‌లో అతనికి చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ గత మూడు నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. వెంటనే అక్కడి నుండి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు.
శ్రీతేజ్‌ని మాములు మనిషిగా మార్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శ్రీతేజ్ తమను ఇంకా గుర్తు పట్టడం లేదని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. తాజాగా.. శ్రీతేజ్‌ను అల్లు అరవింద్, బన్నీ వాస్ పరామర్శించారు.. అతని ఆరోగ్యం కుదుటపడి మామూలుగా మారే వరకూ అండగా ఉంటామని.. భవిష్యత్తులోనూ శ్రీతేజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతని కుటుంబానికి అండగా నిలుస్తామంటూ వారు భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకొని అందరి పిల్లల మాదిరిగా స్కూల్‌కి వెళ్లాలని ఆకాంక్షించారు అల్లు అరవింద్. కాగా, శ్రీతేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అతని ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలు అన్నింటిని భరిస్తున్నారు బన్నీ.
దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కూడా వారికి ఆర్థికంగా సాయం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మొదలు, ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ వరకు ఎప్పటికప్పుడు అల్లు అరవింద్, బన్నీ వాసులను పంపించి, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అర్జున్ తెలుసుకుంటూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్ 4న పుష్ప- 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ఈ ఘటన జరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

