ఆ బాధలోంచే ఈ కథ పుట్టింది
‘దర్శకుడు సుబ్బు మూడేళ్లు కేవలం ఈ సినిమాతోనే జర్నీ చేశారు. అదినాకు చాలా నచ్చింది. కథ ఎంత అద్భుతంగా చెప్పారో, అంతకంటే అద్భుతంగా తీశారు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరం కలిసి ఓ టీమ్ ఎఫర్ట్గా పనిచేశాం. నా కెరీర్లో ‘నాంది’లా ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది’ అని అల్లరి నరేశ్ అన్నారు.
‘దర్శకుడు సుబ్బు మూడేళ్లు కేవలం ఈ సినిమాతోనే జర్నీ చేశారు. అదినాకు చాలా నచ్చింది. కథ ఎంత అద్భుతంగా చెప్పారో, అంతకంటే అద్భుతంగా తీశారు. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందరం కలిసి ఓ టీమ్ ఎఫర్ట్గా పనిచేశాం. నా కెరీర్లో ‘నాంది’లా ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది’ అని అల్లరి నరేశ్ అన్నారు. ఆయన హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బచ్చలమల్లి’. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ని గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లరి నరేశ్ మాట్లాడారు. ‘కరోనా టైమ్‌లో అమ్మను చూడ్డానికి హాస్పిటల్‌కి సరైన సమయంలో వెళ్లలేకపోయా. తీరా వెళ్లే సరికి అదే చివరి చూపు అయ్యింది. జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదని అప్పుడర్థమైంది. వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పు చేయకూడదని అప్పుడు తెలిసింది. ఇలాంటి పాయింట్‌తో నిజాయితీగా ఓ కథ చెప్పాలనిపించింది. అదే ఈ ‘బచ్చలమల్లి” అని దర్శకుడు చెప్పారు. ‘ఇష్టంతో కష్టపడి, ప్రేమించి చేసిన సినిమా ఇది. డిసెంబర్ 20న వస్తున్నాం. హిట్ కొడుతున్నాం.. రాసిపెట్టుకోండి’ అని నిర్మాత రాజేష్ దండా నమ్మకంగా చెప్పారు. ఇంకా కథానాయిక అమృతా అయ్యర్, నటుడు ప్రసాద్ బెహరా, డీవోపీ రిచర్డ్, ఎడిటర్ చోటా కె.ప్రసాద్, కళాదర్శకుడు బ్రహ్మకడలి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

