సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన చిత్రం ‘రా రాజా’. బి.శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమా టీజర్‌ని హీరో అల్లరి నరేశ్ చేతులమీదుగా లాంచ్ చేశారు. ‘24 కేరక్టర్స్ ఇందులో ఉన్నట్టు తెలిసింది. నిమిషంన్నర నిడివి గల ఈ టీజర్లో ఒక్క కేరక్టర్‌ని చూపించలేదు. ఒక్క డైలాగ్ లేదు. కేవలం హారర్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో టెర్రిఫిక్‌గా టీజర్‌ని కట్ చేసిన దర్శకుడికి నా అభినందనలు. టీజర్లో విజువల్స్, నేపథ్యసంగీతం అద్భుతంగా వున్నాయి. కచ్చితంగా ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది’ అని అల్లరి నరేశ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: శ్రీపద్మిని సినిమాస్.