Naresh59 Movie Pre-Teaser | ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు అల్లరి నరేష్. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ తరువాత కామెడీ సినిమాలకు నరేష్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఈయన నుండి సినిమా వస్తుందటే రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు భావిస్తుంటుంటారు. అయితే గతకొంత కాలంగా ఈయన సినిమాలు ఒకే పంతాలో ఉండటంతో ప్రేక్షకులు నరేష్ సినిమాలను థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. దాంతో నరేష్ రోటీన్‌కు భిన్నంగా గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం అనే రూరల్ బ్యాక్‌డ్రాప్ చిత్రాన్ని చేస్తున్నాడు.
ఏఆర్ మొహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ టీజర్‌ను మంగళవారం ఉదయం 10.36 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ చిత్రంలో నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. జీ స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.