Allari Naresh | మరోసారి సీరియస్ పాత్రలో అల్లరి నరేష్.. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల!
Allari Naresh | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో హాస్యాస్పద సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తుంటాడు. యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్‌తో రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా చేస్తాడు. అయితే గతకొంత కాలంగా ఈయన సినిమాలు ఒకే పంతాలో ఉండటంతో ప్రేక్షకులు నరేష్ సినిమాలను థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. దాంతో నరేష్ రోటీన్‌కు భిన్నంగా గతేడాది ‘నాంది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీని పక్కన పెట్టి మొదటి సారి పూర్తి స్థాయిలో నరేష్ ఈ చిత్రంలో సీరియస్ రోల్ పోషించాడు. ఈ సినిమాలో నరేష్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా అల్లరి నరేష్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఈ క్రమంలోనే నరేష్ మరో సిరీయస్ పాత్రలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాను చేస్తున్నాడు. రాజ్‌మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను గత నెలలో మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో నరేష్ మంచం కాలు పట్టుకుని ఎవర్నో కోల్పోయినట్టు బాధతో చూస్తున్నట్లు ఉంది. ఈ పోస్టర్‌ను గమనిస్తే నాంది తరహాలో మరో ఫుల్ లెంగ్త్ సీరియస్ పాత్రలో నటించనున్నాడు. నరేష్‌కు జోడీగా బస్‌స్టాప్ ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో అల్లరినరేష్ ఎలక్షన్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
#Naresh59 #ItluMaredumilliPrajaneekam #IMP @anandhiactress @raajmohan73 @ZeeStudios_ @HasyaMovies @RajeshDanda_ @lemonsprasad @_balajigutta @SricharanPakala pic.twitter.com/oIPsid6p6H
— Allari Naresh (@allarinaresh) May 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

