Bachhala Malli | అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్.. ‘బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్
Allari Naresh | టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.
Allari Naresh | టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ సినిమాకు సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపించనుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ఆకట్టుకుంది. ఇదిలావుంటే నేడు అల్లరి నరేష్ బర్త్ డే. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్.
దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు.. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు.. రాగము, క్రోధము, భయము పోయినవాడు.. అని మహాభారతంలో శ్రీకృష్ణుడి డైలాగ్‌తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇక స్టోరీ ఎం రివీల్ చేయకుండా.. టీజర్ కట్ చేశారు మేకర్స్. చివరిగా ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక అల్లరి నరేశ్‌కి ఇది 62వ చిత్రం. ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో ఉండబోతుండగా.. తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

