Allari Naresh | నాంది తర్వాత సినిమాల వేగం పెంచడమే కాదు.. కథలో ఎంపికలో కూడా రూటు మార్చేశాడు టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేశ్ (Allari Naresh). ఆ తర్వాత సోషల్ డ్రామా నేపథ్యంలో అల్లరి నరేశ్ నటించిన మారేడుమిల్లి ప్రజానీకం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రానికి ఓటీటీ ప్లాట్‌ఫాంలో మంచి స్పందన వచ్చింది. ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
కాగా అల్లరి నరేశ్ ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమా అప్డేట్ అందించాడు. అల్లరి నరేశ్ 61వ సినిమా (Allari Naresh 61st film)గా తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 10:30 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. చిలక ప్రొడక్షన్స్‌పై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలపై రేపు క్లారిటీ రానుంది. అల్లరి నరేశ్ ఈ సారి ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇప్పటికే ఉగ్రం నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన దేవేరి గుండెల్లో చేరి సాంగ్‌తోపాటు టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్ణా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీకి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు.
దేవేరి వీడియో సాంగ్..
ఉగ్రం టీజర్..
Read Also :
Faria Abdullah | రావణాసురలో లాయర్ కనక మహాలక్ష్మిగా కనిపిస్తా : ఫరియా అబ్దుల్లా
Thrinadha Rao Nakkina | కొత్త సినిమాకు చెక్ అందుకున్న ధమాకా డైరెక్టర్.. ఇంతకీ హీరో ఎవరో..?
Anni Manchi Sakunamule | ఫీల్ గుడ్ థీమ్‌తో అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్