Prakash Raj | అందరూ కలిసి నన్ను జోకర్ చేశారు: ప్రకాష్ రాజ్
ఇండస్ట్రీలో జరిగే ఈ వేడుకలకు ప్రకాష్ రాజ్ (Prakash Raj) రాడు.. నటించడం వరకు మాత్రమే తన పని..మిగిలింది తన పని కాదు అంటూ బయటికి వెళ్లిపోవడం ప్రకాష్ రాజ్ శైలి.

ఇండస్ట్రీలో జరిగే ఈ వేడుకలకు ప్రకాష్ రాజ్ (Prakash Raj) రాడు.. చివరికి తాను నటించిన సినిమాల ఫంక్షన్స్ కు అందుబాటులో ఉండడు..నటించడం వరకు మాత్రమే తన పని..మిగిలింది తన పని కాదు అంటూ బయటికి వెళ్లిపోవడం ప్రకాష్ రాజ్ శైలి. ఇండస్ట్రీలో చాలామంది ఈయనపై చేసే విమర్శలు కూడా ఇవే. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఇప్పుడు వచ్చి మా అసోసియేషన్ (Maa Association) అధ్యక్ష పీఠం కోసం ఎన్నికల్లో నిలబడితే విమర్శలు రాకుండా ఎలా ఉంటాయి అంటున్నారు విశ్లేషకులు. అందుకే గత కొన్ని రోజులుగా తన పద్ధతులు మార్చుకుని కొత్త మనిషిలా మారిపోయాడు ప్రకాష్ రాజ్.
ఎంత వెంటబడినా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వని ఈ వ్యక్తి..ఇప్పుడు తనకు తానుగా వచ్చి మీడియా ముందు కనిపిస్తున్నాడు. ఎవరు అడిగినా కూడా కాదనకుండా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇంత మార్పు ఏంటని అడిగితే..తాను తీసుకున్న బాధ్యత అని సమాధానం చెబుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి కూడా వచ్చాడు ప్రకాష్ రాజ్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో కూడా కొన్ని వ్యక్తిగత విషయాలతో పాటు మా అసోసియేషన్ విషయాలు కూడా పంచుకున్నాడు. తాను ఎందుకు పోటీకి నిలబడుతున్నాననే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
ఒకప్పుడు ఈయనను తెలుగు నిర్మాతల మండలి (Telugu Film Producers Council) బ్యాన్ చేసింది..ఒకరకంగా మా అసోసియేషన్ దూరం పెట్టింది. ఎవరైతే దూరం పెట్టారో.. అదే అసోసియేషన్ కు ఇప్పుడు అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతోనే నువ్వు పోటీ చేస్తున్నావా..? అని అడిగాడు అలీ. మహేష్ బాబు ఆగడు (Aagadu) సినిమా సమయంలో నిర్మాతలతో ఆయనకు పెద్ద గొడవ జరిగింది. అదే సమయంలో షూటింగ్ లొకేషన్ లో ఒకరిపై చేయి చేసుకున్నాడంటూ ప్రకాష్ రాజ్ పై బ్యాన్ విధించారు నిర్మాతలు. తనను నిర్మాతలు బ్యాన్ చేసిన విషయాన్ని ఎప్పుడో మరిచిపోయానని ప్రకాష్ రాజ్ చెప్పాడు.
ఇక వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ..ఇంట్లో తన రాజ్యం నడవదు అంటూ సరదాగా మాట్లాడాడు. బయట ఎలా ఉన్నా కూడా ఇంటికి వెళితే ఆడవాళ్లు చెప్పింది నడవాలి అంటున్నాడు. వాళ్లు చెప్పినట్లు వింటానని క్లారిటీ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంట్లో తను వాళ్లంతా కలిసి జోకర్ చేస్తారు అంటున్నాడు. ఏ మాత్రం టైం దొరికినా కూడా వెంటనే కుటుంబంతో గడుపుతుంటాడు ప్రకాష్ రాజ్. అలాంటి వ్యక్తి ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల కోసం ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడు. మరి ఈ కష్టానికి తగిన ఫలితం వస్తుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Chaitan Bharadwaj | మహాసముద్రంలో చాలా ట్విస్టులుంటాయి: చేతన్ భరద్వాజ్
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

