Alia-Ranbhir wedding | బాలీవుడ్ ప్రేమజంట ఆలియా భట్-రణ్బీర్ కపూర్ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం బాంద్రాలోని ‘వాస్తు’ లో ఘనంగా వీరి వివాహం జరిగింది . ఈ పెళ్లి వేడుకకు కేవలం 28 మంది సెలబ్రిటీలు మాత్రమే హజరయ్యారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా-సైఫ్ దంపతులు, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, ఆకాశ్ అంబానీ తదితరులు హజరయ్యారు. తాజాగా ఆలీయాభట్ పెళ్ళి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.ఈ ఫోటోలను చూసిన నెటీజన్లు విషెస్లను తెలుపుతున్నారు.