‘ఆల్ఫా’ సినిమా మహిళల దృఢమైన వ్యక్తిత్వానికి ప్రతీకలా ఉంటుందని చెప్పింది అగ్ర కథానాయిక అలియాభట్. ఆమెతో పాటు శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన ఫీమేల్ ఓరియెంటెడ్ స్పైథ్రిల్లర్ ‘ఆల్ఫా’ జూలై 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అలియాభట్ చిత్ర విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ కథ ఇద్దరు నాయికల చుట్టూ తిరుగుతుందని, అదే తనకు ఎక్కువగా సంతోషాన్ని కలిగించిన అంశమని తెలిపింది.
‘నా కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని గర్వంగా చెప్పగలను. రోమాంచితమైన పోరాట ఘట్టాలు, అనూహ్యమైన మలుపులు, సాహసాలతో కూడిన సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తుంది. మొత్తంగా ‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కి, సెలబ్రేషన్‌కి ప్రతీక’ అని అలియాభట్ పేర్కొన్నది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానుంది. ఆదిత్యచోప్రా నిర్మాణంలో శివ్ రవాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.