Alia Bhatt | రాహా కోసం కొత్త కలలు.. సినిమాలపై కాదు, ఆ వైపు దృష్టి పెడుతున్న అలియా భట్
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముద్దుల కూతురు రాహా కపూర్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చలు సాగుతూనే ఉన్నాయి. కేవలం మూడేళ్ల వయసులోనే ఆమెకు ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ పిల్లలు సినిమా ఇండస్ట్రీకి వస్తారని అనుకుంటే, ఈ విషయంలో ఆలియా మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు.
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ముద్దుల కూతురు రాహా కపూర్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చలు సాగుతూనే ఉన్నాయి. కేవలం మూడేళ్ల వయసులోనే ఆమెకు ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ పిల్లలు సినిమా ఇండస్ట్రీకి వస్తారని అనుకుంటే, ఈ విషయంలో ఆలియా మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా భట్ తన కూతురు భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహా భవిష్యత్తులో బాలీవుడ్లో కాకుండా క్రీడారంగంలో రాణించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక అథ్లెట్‌గా ఎదగాలని తన మనసులో ఉన్న కోరికను స్పష్టంగా వ్యక్తం చేశారు. టీమ్ వర్క్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను క్రీడాకారిణి అయి ఉంటే తప్పకుండా టీమ్ స్పోర్ట్ ఎంచుకునేదాన్నని ఆలియా చెప్పారు.
రాహాలో ఇప్పుడే స్పోర్ట్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని ఆలియా పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఆమె చురుకుదనం, పోటీ తత్వం గమనించదగ్గవని చెప్పారు. ఎప్పుడూ చురుగ్గా కదులుతూ ఉండే రాహాకు క్రీడలు బాగా సరిపోతాయని ఆమె భావిస్తున్నారు. ఒక జట్టుగా కలిసి పని చేయడంలో ఉన్న ఆనందం, క్రమశిక్షణ వంటి విలువలు క్రీడల ద్వారానే వస్తాయని ఆలియా నమ్మకం. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన ఆలియా, తన ఎదుగుదలలో కొందరు మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేసుకున్నారు. తన తల్లి సోనీ రజ్దాన్ తనకు స్ఫూర్తిగా నిలిచారని, అలాగే సోదరి షాహీన్ భట్ మానసిక ఆరోగ్యంపై ధైర్యంగా మాట్లాడటం తనను ప్రభావితం చేసిందని తెలిపారు. తన టీమ్‌లో ఉన్న మహిళల మద్దతు కూడా తన విజయానికి కారణమని చెప్పారు.
తల్లి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కూడా ఆలియా స్పందించారు. మాతృత్వం వల్ల ప్రాధాన్యతలు మారినా, తన కెరీర్‌పై ఆసక్తి తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాను ఎక్కువగా క్వాలిటీ ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసుకుంటూ పని చేస్తున్నానని తెలిపారు. రాహా పుట్టిన తర్వాత జీవితాన్ని మరింత బాధ్యతగా తీసుకుంటున్నానని చెప్పారు. ఇక రణ్‌బీర్ కపూర్‌తో ఆలియా ప్రేమ ప్రయాణం బ్రహ్మాస్త్ర సినిమా సమయంలో ప్రారంభమైంది. 2022లో వీరు వివాహం చేసుకోగా, అదే ఏడాది నవంబర్‌లో రాహా జన్మించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

