Ranbir Kapoor-Aliabhatt | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి కాబోతుంది. తాజాగా అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లి కాబోతున్నట్లు ఫోటోలను పోస్ట్ చేసింది. హాస్పిటల్లో టీవిని చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. దీనితో పాటుగా బేబి సింహంతో రెండు సింహాలు అన్యోన్యంగా కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్, కరణ్‌జోహార్, మౌనీ రాయ్ వంటి పలువురు సెలబ్రెటీలు అభినందనలు తెలుపుతున్నారు. కాగా రణ్‌బీర్ కపూర్, అలియా భట్లు ఏప్రిల్ 14న ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.