Ala Vaikunthapurramuloo | షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం దేవా. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించగా.. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్(Deva Movie Promotions)లో భాగంగా పూజా మాట్లాడుతూ.. అలా వైకుంఠపురములో తమిళ సినిమా అని ఇది పాన్ ఇండియా లెవల్లో రీచ్ అయ్యిందని తెలిపింది.అలాగే దువ్వడా జగన్నాథం(డీజే) కూడా నార్త్‌లో కూడా సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకోచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు విన్న అల్లు అర్జున్ అభిమానులతో పాటు తెలుగు మూవీ లవర్స్ పూజా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు నటించిన సినిమా.. నీకు సూపర్ హిట్ ఇచ్చిన కూడా ఏ భాష అనేది తెలియాకుండా ఎలా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం అలా వైకుంఠపురములో. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పూజా హెగ్దే కథానాయికగా నటించింది. లాక్ డౌన్ ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.
If Ala Vaikunthapuram lo is a Tamil film
They’d call it
Ala church lo …@hegdepooja how did you miss such basic pointpic.twitter.com/5KwAmPIWgU
— 🧠 (@BackupBrainy) February 3, 2025