మరో సౌత్ రీమేక్ హక్కులు తీసుకున్న అక్షయ్ కుమార్..!
ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో రీమేక్ కింగ్ ఉంటాడు. తెలుగులో వెంకటేష్.. తమిళంలో విజయ్.. కన్నడంలో సుదీప్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో హీరో అధికంగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు.

ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో రీమేక్ కింగ్ ఉంటాడు. తెలుగులో వెంకటేష్.. తమిళంలో విజయ్.. కన్నడంలో సుదీప్.. ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో హీరో అధికంగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. అలా హిందీలోనూ ఓ హీరో ఉన్నాడు. ఆయనే అక్షయ్ కుమార్. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా సౌత్ రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపించేవాడు. ఇప్పటికీ చూపిస్తున్నాడు కూడా. అయితే ఆయన కంటే అధికంగా అక్షయ్ కుమార్ మన సినిమాలపై మోజు పడుతున్నాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఓ సినిమా హిట్ అయిందంటే చాలు.. అక్కడ అక్షయ్ కుమార్ దాన్ని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఓ వైపు ఒరిజినల్ కంటెంట్ చేస్తూనే.. మధ్య మధ్యలో రీమేక్ సినిమాలకు కూడా టైమ్ కేటాయిస్తున్నాడు. రిస్క్ లేని సినిమాలు కావడంతో వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. తాజాగా ఈ క్రమంలోనే మరో సినిమాకు కూడా అక్షయ్ కుమార్ ఓకే చెప్పాడు. అంతేకాదు కథ నచ్చి ఏకంగా నిర్మాతగా మారి సినిమా చేయడానికి హక్కులు కూడా కొన్నాడని తెలుస్తుంది. ఆ సినిమా రాక్షసుడు..తమిళంలో సూపర్ హిట్ అయిన రాట్చసన్ సినిమాను, తెలుగులో హవీష్ ప్రొడక్షన్స్ హక్కులు తీసుకున్నారు. ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేస్తే బాగానే ఆడింది. ఇదే సినిమాను హిందీలో హవీష్ నిర్మించాలనుకున్నాడు. కానీ కరోనా కారణంగా సినిమా ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా హక్కులను అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నాడు.
ఆయనకు మంచి రేటుకే హవీష్ అమ్మేసినట్లు తెలుస్తుంది. జులైలోనే షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు ఖిలాడీ. రాక్షసుడు రీమేక్ లో ఈయనే హీరోగా నటించబోతున్నాడు. దర్శకుడిగా ఓ స్టార్ డైరెక్టర్ ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ లో ఓ స్టార్ కారెక్టర్ ఆర్టిస్ట్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి సౌత్ లో సంచలనం రేపిన రాక్షసుడు.. హిందీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

