Ram Setu | ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్‌కుమార్ ‘రామ్‌సేతు’ ట్రైలర్..!
Ram Setu Trailer | బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుకోలేకపోయాయి.
Ram Setu Trailer | బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈయనకు కమర్షియల్‌గా మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కావాలి. ఈ క్రమంలోనే ‘రామ్‌సేతు’ వంటి యాక్షన్ అడ్వేంచర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడులైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకంటుంది. రామ్‌సేతు బ్రిడ్జ్‌ను కాపాడటానికి అక్షయ్‌కుమార్ అండ్ బృందం చేసే సాహసాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ పురావస్తు పరిశోధకుడిగా కనిపించనున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భారుచ్చా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Read Also:
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
Mega154 | దీపావళికి మెగా సర్ప్రైజ్.. చిరు అభిమానులకు పండగే..!
‘లైగర్’ ఫ్లాప్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
Ponniyin Selvan-1 | ‘400కోట్ల’ క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’ ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

