Akhshay Kumar Latest Poster | బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీ షెడ్యూల్‌తో ఉంటాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ బాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. బడ్జెట్లో సగం కలెక్షన్లను కూడా రికవరి చేయలేకపోయింది. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే అక్షయ్‌కుమార్ కొత్త సినిమా పోస్టర్ లీకైంది.
అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రాన్ని మరోసారి టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘రుస్తుం’ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లీక్ అయింది. ఈ పోస్టర్లో అక్షయ్ ‘సింగ్’ గెటప్‌లో తలకు టర్బన్ చుట్టుకొన్ని గ్లాసెస్ ధరించాడు. లేటెస్ట్గా లీక్ అయిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ చిత్రాన్ని పూజా ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వషు భగాని నిర్మిస్తున్నారు. గతంలో ఈ ప్రొడక్షన్లోనే అక్షయ్ బెల్ బాటమ్ సినిమాను చేశారు. మరో సారి ఈ కాంబోలు రిపీటవడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ద్వితియార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.