Kesari Chapter 2 | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter2). అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనేది ట్యాగ్‌లైన్. మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మ ప్రోడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశాడు అక్షయ్ కుమార్. ఈ సినిమా చూసేవారు ఇంట్రో మిస్ అవ్వకండంటూ తెలిపాడు.
ఈ సినిమా చూడటానికి వచ్చే వారందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే.. దయచేసి ‘కేసరి 2’ ఇంట్రో మిస్ అవ్వకండి. ఈ సినిమాలోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. మీ కెమెరా ద్వారా ఇది ప్రతి ఒక్కరికీ చేరుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్నవారు ఆలస్యంగా రాకూడదని తెలుసుకోవాలి. సరైన సమయంలో రావాలి. ఈ సినిమా యొక్క కథ ఆ 10 నిమిషాలు నుంచే ప్రారంభమవుతుందంటూ అక్షయ్ చెప్పుకోచ్చాడు.