Khel Khel Mein | ఫోన్ అన్‌లాక్ చేసి భార్యకి ఇస్తే.. ఆసక్తికరంగా అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్
‘Khel Khel Mein’ | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ & ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘Khel Khel Mein’ | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ & ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తే.. తమిళంలో హిట్ అయిన లవ్ టూడే సినిమా స్టోరీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. అక్షయ్ కుమార్, తాప్సీ, వాణి కపూర్ అంతా ఫ్రెండ్స్. ఒక పార్టీలో వీళ్లందరు కలుసుకోని ఒక గేమ్ ఆడదాం అనుకుంటారు. ఇంతకీ ఆ గేమ్ ఏంటి అంటే.. అందరు తమ ఫోన్స్ అన్ లాక్ చేసి చూపించాలి. అయితే ఆ ఫోన్స్‌లో ఏం ఉంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం జనరేషన్లో మొబైల్స్‌కి అలవాటు పడిన జనాలు ఏం చేస్తున్నారు. ఏం చూస్తున్నారు అనే స్టోరీతో కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం 2016 ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కి రీమేక్.
Also Read..
Manu Bhaker: ప్రిసిషన్ రౌండ్లో అదరగొట్టిన మనూ భాకర్
SL Vs Ind | భారత్‌తో తొలి వన్డే.. మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

