Jallianwala Bagh Massacre | భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనలలో జలియన్ వాలాబాగ్ ఉదాంతం ఒకటి. బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉదాంతం జరిగిన తర్వాత పరిణమాలకు సంబంధించి ఒక సినిమా రాబోతుంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter2). మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మ ప్రోడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. జలియన్ వాలా బాగ్ ఘటనపై ఈ సినిమా రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జలియన్ వాలాబాగ్ ఉదాంతం మీకు తెలుసు. ఇప్పుడు చెప్పలేని నిజాన్ని వెలికితీయండంటూ పోస్టర్లో రాసుకోచ్చారు.
జలియన్ వాలాబాగ్ ఘటన
వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది ప్రజలు 1919 ఏప్రిల్ 13న అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. పంజాబ్‌లో యుద్ధ చట్టాన్ని అమలు చేసి, శాంతిభద్రతల బాధ్యతను బ్రిగేడియర్ జనరల్ డయ్యర్‌కు అప్పగించింది. ఆందోళనలు ఇంకా ఆగలేదు. రౌలాట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13 న అమృత్‌సర్‌లోని జలియన్ వాలా బాగ్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 25 నుంచి 30 వేల మంది హాజరయ్యారు. జనరల్ డయ్యర్ తన దళాలతో అక్కడికి వచ్చి నిరాయుధ ప్రజలపై కాల్పులు జరుపుతానంటూ బెదిరించాడు. దాంతో అక్కడ గందరగోళం నెలకొన్నది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి పరుగెత్తటం ప్రారంభించారు. చాలా మంది తోటలోని బావిలోకి దూకారు. కాల్పులు సుమారు 10 నిమిషాలు కొనసాగాయి. ఇందులో వేయికి పైగా జనం మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
You know the massacre, now uncover the untold truth. #KesariChapter2 in cinemas 18th April, worldwide. pic.twitter.com/ZhG3lmOhFs
— Dharma Productions (@DharmaMovies) March 29, 2025