Akshay Kumar | శిఖర్ ధావన్‌తో కలిసి చిందేసిన అక్షయ్ కుమార్.. మస్త్ మలాంగ్ ఝూమ్ పాటకు స్టెప్పులు.. వీడియో
Akshay Kumar | బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshaykumar) .. ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)తో కలిసి చిందేశాడు. ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు.
Akshay Kumar | బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshaykumar), టైగర్ ష్రాఫ్ (Tigershroff) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’ (Bade Miyan Chote Miyan). రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా టైగర్ ష్రాఫ్ తన అభిమానులు, తోటి నటులకు #GoMastMalangJhoom ఛాలెంజ్ విసిరారు.
ఛాలెంజ్‌లో భాగంగా ‘బడే మియాన్ చోటే మియాన్’ నుంచి రిలీజ్ అయిన ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ (Mast Malang Jhoom) పాటకు డ్యాన్స్ చేయాలని కోరాడు. ఈ ఛాలెంజ్‌ను అక్షయ్ కుమార్ తాజాగా స్వీకరించాడు. ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)తో కలిసి ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. అనంతరం సహ నటులు సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్‌తోపాటు స్టార్ నటి కత్రినా కైఫ్‌కు కూడా ఈ ఛాలెంజ్ విసిరాడు.
కాగా, ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ సాంగ్ ని మేకర్స్ నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా నటించిన ఈ పాట ఆకట్టుకునే బీట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే పాట మధ్యలో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్‌లు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు హుక్ స్టెప్పును రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు ‘నాటు నాటు..’ స్టెప్పులను కాపీ కొట్టారంటూ బాలీవుడ్ స్టార్స్‌ను ట్రోల్ చేస్తున్నారు.
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.
Also Read..
Kanguva | Udhiranకు కంగువ మేకర్స్ ధన్యవాదాలు.. ట్రెండింగ్‌లో స్టిల్
Lok Sabha | వంద మందితో బీజేపీ తొలి లిస్ట్.. నేడు ఎక్షణమైనా రిలీజ్ కావొచ్చు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

