Sanjay Leela Bhansali | ఆ అక్కినేని హీరోతో సంజయ్ లీలా భన్సాలీ మూవీ చర్చలు..!
Sanjay Leela Bhansali | భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీ ఒకడు. వాస్తవిక కథలను అందంగా, అందరికి అర్థమయ్యేట్టుగా తెరపై చూపించడంలో సంజయ్ లీలా భన్సాలీ సిద్ద హస్తుడు. ఈయన సినిమాలలో టేకింగ్ గాని, విజువలైజేషన్ గాని ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. బాలీవుడ్లో పిరీయాడిక్ చిత్రాలను ఈయన కన్నా బాగా ఎవరు తెరకెక్కించలేరేమో అని అనిపిస్తుంది. ఇక ఇటీవలే ‘గంగుబాయి కతియావాడి’తో మంచి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈయన నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘హీరమండి’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈయన యువ సామ్రాట్ నాగచైతన్యతో చేతులు కలుపనున్నట్లు తెలుస్తుంది.
‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్‌కు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్‌లు వేసింది. భారీ అంచనాలతో జూలై 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా చైతన్య, సంజయ్ భన్సాలీని కలిశాడట. వీరిద్దరి కలియకలో ఓ మూవీ కోసం చర్చలు జరిగినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈయన కీలకపాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 12న విడుదల కానుంది. ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నాడు. దీనితో పాటుగా చైతన్య, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ధూత అనే హార్రర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. దీని తర్వాత ‘మానాడు’ ఫేం వెంకట్ ప్రభూ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రాన్ని చేయబోతున్నాడు.
Read Also:
Mithilesh Chaturvedi | ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
Gargi Movie | అప్పుడే ఓటీటీలోకి సాయిపల్లవి ‘గార్గి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sitaramam Movie | భారీగా ‘సీతారామం’ థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

