ఫిల్మ్ ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్(ఫాస్) అక్కినేని సెంటనరీ అవార్డుల ప్రధానోత్సవం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఫాస్ అధినేత డాక్టర్ కె.ధర్మారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు బాబూమోహన్ సభా ప్రారంభం చేశారు. అక్కినేని సెంటనరీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావుకు అందించారు.
తమ్మారెడ్డి భరద్వాజ్, బాబుమోహన్, రేలంగి నరసింహారావు, నటి కవిత చేతుల మీదుగా పురస్కార ప్రధానం జరిగింది. అలాగే స్వర్గీయ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి స్థాపించిన ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్‌కి అక్కినేని సెంటనరీ ఫిల్మ్ అవార్డును అందించారు. సంస్థ తరఫున తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఇంకా నటి కవితకు అక్కినేని సెంటనరీ అవార్డును అందించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు రజతోత్సవ సినీ జీవిత పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డులను అందుకున్న వారిలో నటుడు అశోక్‌కుమార్, డబ్బింగ్ కళాకారుడు ఆర్సీఎం రాజు, గాయకుడు డి.ఏ మిత్రా, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వంశీరామరాజు కూడా ఉన్నారు. జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించడం పట్ల కోట శ్రీనివాసరావు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సభలో పాల్గొన్న వారంతా మాట్లాడారు.