Akhil Movie | అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అఖిల్: ది పవర్ ఆఫ్ జువా (Akhil : The Power Of Jua). ఈ సినిమాకు వి.వి. వినాయక్ (VV.Vinayak) దర్శకత్వం వహించగా.. సయేషా సైగల్ (Sayyeshaa Saigal) కథనాయికగా నటించింది. కోన వెంకట్ రచయితగా పనిచేశారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ (Nithin), సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) నిర్మించారు. రాజేంద్రప్రసాద్, మహేష్ మంజ్రేకర్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాకు అప్పట్లోనే ముగ్గురు సంగీత దర్శకులు(అనూప్ రూబెన్స్, మణిశర్మ, థమన్) సంగీతం అందించారు. భారీ అంచనాల మీద వచ్చిన ఈ చిత్రం 2015 నవంబర్ 11న విడుదలై ఫస్ట్ షో నుంచే డిజాస్టార్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా డిజాస్టార్ అవ్వడానికి ముఖ్య కారణం వి.వి.వినాయక్ అంటూ కోన వెంకట్ తెలిపాడు.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన అఖిల్ సినిమా విశేషాలను పంచుకున్నాడు. అఖిల్ సినిమా ఎందుకు డిజాస్టర్ అయ్యింది..? అని ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడుగడంతో.. కోన సమాధానమిస్తూ.. అఖిల్ సినిమా స్టార్ట్ అవ్వకముందే.. ఈ కథ సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుందని వి.వి వినాయక్‌కి అడ్డం పడ్డాను. వినాయక్‌ని ఒప్పించడానికి చాలా ట్రై చేశాను. నేను ఒక్కడినే సరిపోనని వినాయక్ స్నేహితులతో కూడా నేను వద్దని చెప్పించే ప్రయత్నం చేశాను. అప్పుడు వినాయక్ మాట్లాడుతూ.. లేదు నన్ను నమ్మండి ఇది వర్కవుట్ అవుతుంది అంటూ చాలా నమ్మకంగా ముందుకు వెళ్లాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక హిట్ సినిమాకి కారణం నమ్మకం. ఒక ఫ్లాప్ సినిమాకి కారణం గుడ్డి నమ్మకం. ఈ సినిమా సక్సెస్ అవుతుందని వి.వి. వినాయక్ గుడ్డిగా నమ్మాడు. నేను అంతకంటే ఎక్కువు డిజాస్టార్ అవుతుందని నమ్మాను. నేను అనుకున్నట్లే సినిమా అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది అంటూ చెప్పుకోచ్చాడు.
నాకు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా వినాయక్‌తో చాలా దగ్గరిబంధం. ఎంతోమంది స్టార్స్ ను లీడ్ చేసిన అనుభవం ఆయనది. ప్రస్తుతం ఇంకో సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. కచ్చితంగా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారంటూ కోన వెల్లడించాడు.