Agent Movie | అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అఖిల్ ఈ సినిమాలో రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అఖిల్ ఖాతాలో ఒక్క బ్లాక్‌బస్టర్ కూడా లేదు. ఏడాది కిందట రిలీజైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బ్రేక్ ఈవెన్‌తో సరిపెట్టుకుంది. కానీ నిర్మాతలకు మాత్రం లాభాలు తెచ్చిపెట్టలేదు. దాంతో కమర్షియల్‌గా ఈ సినిమా జస్ట్ హిట్ అనిపించుకుంది. ప్రస్తుతం అఖిల్ ఆశలన్నీ ఏంజెంట్ పైనే ఉన్నాయి. అఖిల్ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడట. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ సినిమా కోసం అఖిల్ కండలు పెంచి దేహానికి కూడా పనిచెప్పాడు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాలో 6ప్యాక్‌తో ఉన్న ఫోటోలను అభిమానులోతో పంచుకున్నాడు. పర్ఫెక్ట్ బాడీ టోన్డ్ స్కిన్‌తో ఉన్న యాబ్స్లో అఖిల్ హాలీవుడ్ హీరోను తలపిస్తున్నాడు. అఖిల్ షేర్ చేసిన ఈ ఫోటో కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. 2022కు వీడ్కోలు పలుకుతూ.. కొత్త సంవత్సరానికి రెడీగా ఉన్నానంటూ బీస్ట్ మోడ్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య నటిస్తుంది.