Akhanda 2 | నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త మూవీని ప్రారంభించాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడు.. సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో మళ్లీ చేతులు కలిపాడు బాలయ్య. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2 – తాండవం’ (Akhanda 2). బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే తాజాగా ఈ చిత్రం నేడు పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ముహూర్తపు షాట్‌కు బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా.. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని స్విచాన్ చేసింది. ఇక క్లాప్ అనంతరం బాలకృష్ణ మూవీ డైలాగ్‌తో అలరించాడు.
ఇక ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అఖండ తరువాత ఈ సినిమా వస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం పొలిటికల్ టచ్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ అంటేనే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. మరి ఈసారి ఎలాంటి సంచలన సినిమాతో ఈ ఇద్దరూ రాబోతున్నారో చూడాలి.
#BB4 is #Akhanda2 – Thaandavam 🔱
Title theme out now!
▶️ https://t.co/xmMACJQ7DxGet ready for a MONUMENTAL FILM from the EPIC MASSIVE COMBINATION ❤🔥
Shoot begins soon 💥💥
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @14ReelsPlus @MusicThaman @RaamAchanta… pic.twitter.com/DNKJl1ExJO
— 14 Reels Plus (@14ReelsPlus) October 16, 2024